Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ప్రభుదేవా అన్నయ్య లాంటివాడు : హన్సిక

ప్రభుదేవాతో నాకు ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, ప్రభుదేవా తనకు అన్నయ్యతో సమానమని బొద్దుగుమ్మ హన్సిక అంటోంది. హన్సికకు ప్రభుదేవాతో ఎఫైర్ ఉందని, అందుకే నయనతార-ప్రభుదేవాల బంధం చెడిందనితమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై హన్సిక స్పందిస్తూ... ఈ వార్తలను కొట్టి పారేసింది. ప్రభుదేవా-నయనతారల మధ్య విభేదాలు రావడానికి తాను కారణమనే వార్తలు విని షాకయ్యా... ప్రభుదేవా నాకు అన్నయ్య లాంటివాడు. మా ఇద్దరిపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధ పెట్టింది.

ఇలాంటి అసత్య వార్తలను, అర్థం పర్తంలేని కథనాలను రాయొద్దని ట్విట్టర్ ద్వారా మీడియాను వేడుకొంది. మంచు విష్ణు నటిస్తున్న సినిమాలో హన్సిక హీరొయిన్ గా ఎంపికయింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందనుంది.