Wednesday, Feb 22nd

RSS

Telugu News - Online Telugu News Portal

జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు

పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్ను తిరువారూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

Read more...

2జీ కేసులో సుప్రీం సంచలన తీర్పు , చిదంబరానికి ఊరట

2జీ కేసులో చిదంబరాన్ని చేర్చాలన్న జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌లో చిదంబరానికి తాత్కాలికంగా ఊరట లభించింది. కేసు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు 2జీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రశాంత్ భూషణ్ పిటిషన్‌కు కోర్టు అంగీకరించలేదు. దానికి బదులుగా సీవీసీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి హర్షం వ్యక్తం చేసారు.

Read more...

జయలలిత vs విజయ్ కాంత్

తమిళనాడులో మిత్రపక్షాలైన అన్నాడిఎంకె, డిఎండికె ల మధ్య వార్ నడుస్తుంది. శాసనసభలో ఇరు పార్టీ వర్గాలు వాగ్వాదానికి దిగారు. శానససభ నుంచి బుధవారం విజయకాంత్‌తో సహా డిఎండికె సభ్యులు వాకౌట్ చేశారు. డిఎండికె సభ్యుడు చంద్రకుమార్ - ధరల పెరుగుదలపై జయలలితను ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఆయన అడిగారు. అయినా శంకరన్‌కోవిలి ఉప ఎన్నికలో తమ అన్నాడియంకె గెలిచిందని ఆమె సమాధానం ఇచ్చారు.

Read more...

హైకోర్టులో నరేంద్ర మోడీకి ఊరట

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. నానావతి కమిషన్ ముందు మోడీ వ్యక్తిగతంగా హాజరుకావలసిన అవసరంలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అల్లర్ల కేసులో మోడీని విచారించాలని జన్సంఘర్ష్ వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది.

2జీ కేసు తీర్పుపై 'చిదంబరం' టెన్షన్

2జీ కుంభకోణం ఉచ్చు యూపీఎను వెంటాడుతోంది. 2జీ కుంభకోణంలో రెండు ప్రధానమైన జడ్జిమెంట్లు మరో రెండు రోజుల్లో రానున్నాయి. అందులో మొదటిది 2జీ కేసులో హోంమంత్రి చిందబరాన్ని సీబీఐ విచారించలన్నది కాగా రెండోది అటార్నీ జనరల్ పాత్రపై విచారణకు ఆదేశించాలన్న పిటీషన్. జస్టిస్ అశోక్ గంగూలి పదవీకాలం మే 2వ తేదీతో ముగియనున్న దరిమిలా వీటిపై మరో రెండు రోజుల్లోగా తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

Read more...

వారిని మాకు అప్పగించండి : భారత్

26/11 ముంబై దాడుల్లో కీలక నిందితులు తొమ్మిది మందిని తమకు అప్పగించాలని అమెరికా, పాకిస్తాన్ లను భారత్ కోరనుంది. ఇందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ జాబితాలో పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హీడ్లీ, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, మరో ఇద్దరు ఐఎస్ఐ అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ నిందితుల అప్పగింతకు సంబందించిన వినతులను త్వరలోనే అమెరికా, పాకిస్తాన్ లకు పంపుతామని తెలిపారు.

Read more...

సాల్మన్ రష్దీకి హక్కు లేదు : ఇమ్రాన్

ముస్లీం మతస్థుల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు సాల్మన్ రష్దీకి లేదని పాకిస్థాన్ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. కోల్‌కతా లిటరరీ మీట్‌కు హాజరైన ఇమ్రాన్ మాట్లాడుతూ... రష్దీ రాసిన ‘ది సటానిక్ వర్సెస్’ సమస్యే కాదని ఓ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సమాజాన్ని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికి లేదని ఇమ్రాన్ అన్నారు. శాంతియుతంగా నివసించడానికి ఒకరినొకరు అర్ధం చేసుకోవాలన్నారు.

Read more...

సచిన్ పైలట్ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డు మృతి

కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ఇంటి వద్ద 32 ఏళ్ల సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నాగాలాండ్‌లోని కోహిమాకు చెందిన ఇనపు అనే ఆ సెక్యూరిటీ గార్డు తన గన్‌ను తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆ సంఘటన న్యూఢిల్లీలోని సఫ్ధర్ గంజ్ రోడ్డులో పైలట్ నివాసం వద్ద జరగిందని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలో స్యూసైడ్ నోటీసు ఏదీ లభించలేదు.

Read more...

పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన పోలింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లో 117 స్థానాలకు గాను 1,078 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కోటీ 76 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 19 వేలా 841 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 200 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు.

Read more...