ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్నా బృందం తమ ప్రచార ప్రణాలికను ప్రకటించింది. ఈ నెల 21న ఉత్తరాఖండ్ లో ప్రచారం మొదలవుతుందని, ఫిబ్రవరిలో ఎక్కువభాగం ఉత్తరప్రదేశ్ లో ప్రచారం చేస్తామని తెలిపారు. ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రాచారం చేయమని కేవలం బలమైన లోక్ పాల్ బిల్లు అవసరాన్ని వివరిస్తామని తెలిపారు.
ఈ పర్యటనలలో ఉద్యమానికి సంబంధించి పార్టీల స్పందన, లోక్ పాల్ పై వాటి వైఖరిని ప్రజలకు చెపుతాం, బలమైన లోకాయుక్త బిల్లు తెచ్చే విధంగా పార్టీలను ప్రజలు కోరేవిధంగా ప్రోత్సహిస్తాం అని అన్నా బృందంలోని సభ్యుడు ఒకరు చెప్పారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఉత్తరాఖండ్ లో, 24,25 పంజాబ్ లో, వచ్చే నెల 2 నుంచి 23 వరకు ఉత్తరప్రదేశ్ లో ప్రచారం చేయనున్నారు.
| < Prev | Next > |
|---|


