Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

రేపు 'వికీపీడియా' బంద్

అంతార్జాలంలో ఏ సమాచారం కోసం అయినా అందరూ చూసే వికీపీడియా రేపు మనకు కనిపించదు. విశ్వవ్యాప్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ సైట్ ఒక రోజు మూగాబోనుంది. అమెరికాలో ప్రతిపాదిత యాంటి పైరసీ చట్టం అంతర్జాలం భాచ్విష్యత్తుకి ప్రమాదకరమని వికీపీడియా వ్యవస్థాపకుడైన జిమ్మీవేల్స్ భావిస్తున్నారు.

తమ వాదనకు మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన 24 గంటలపాటు వికీపీడియా ఆంగ్ల సైట్ ను మూసివేయబోతున్నారు. రేపు వికీపీడియా పేజీల బదులు వివాదాస్పదమైన స్టావ్ ఆన్ లైన్ పైరసీ యాక్ట్, ప్రొటెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ లకు సంబందించిన సమాచారం మాత్రమే కనిపిస్తుంది.