ఇండియన్ ఆర్మీ చీఫ్ వికె సింగ్ తీవ్రమైన చర్యకు దిగారు. సుప్రీంకోర్టులో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంపై సమరాన్ని ఆయన గౌరవం కోసం సమరంగా అభివర్ణించుకున్నారు. తన జన్మ తేదీపై నెలకొన్న వివాదం పరిష్కారానికి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైన్యం వారసత్వం సమస్యను కోర్టు నిర్ణయం పరిష్కారం చూపే అవకాశం ఉంది.
తన జన్మతేదీని 1951 మే 10వ తేదీగా మార్చాలని ఆయన రక్షణ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. దాన్ని మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఆయన జన్మతేదీ 1950 మే 10వ తేదీగా నమోదైంది. జన్మ తేదీని మారిస్తే మరో పదేళ్ల పాటు వికె సింగ్ పదవీ కాలం పెరుగుతుంది.
| < Prev | Next > |
|---|


