Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఆర్మీచీఫ్ వివాదంపై పిటీషన్ కొట్టివేత

ఆర్మీచీఫ్ జనరల్ వి.కె.సింగ్ జనన తేదీపై తలెత్తిన వివాదంపై వేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టిపారేసింది. వికె సింగ్‌ జనన తేదీని మే10, 1951గా అంగీకరించాలని గ్రెనేడీర్స్‌ అసోసియేషన్‌ రోహతక్ శాఖ సుప్రీంలో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ను చట్టపరిధిలో పరిష్కరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఒక అసోసియేషన్‌ తరపు నుంచి వేసిన రిట్‌ పిటీషన్‌ ఆమోదం యోగ్యం కాదని కోర్టు పేర్కొంది. చీఫ్‌ జస్టిస్‌ కపాడియా నేతృత్వంలోని బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. జనన తేదీ సమస్య పూర్తిగా సర్వీస్‌ వ్యవహారమని కోర్టు తెలిపింది.