అవినీతిరహిత దేశం కోసం ప్రజలంతా ఓటు వేయాలనే నినాదంతో అన్నా హజారే బృందం శనివారం నుంచి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. అయితే ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగానూ తమ ప్రచారం ఉండదని అన్నా టీం స్పష్టం చేస్తున్నప్పటికీ.. పరోక్షంగా కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చడమే ఎజెండాగా కనిపిస్తోంది. పటిష్ట లోక్‌పాల్ బిల్లు విషయంలో యూపీఏ సర్కారు దేశాన్ని ఎలా మోసం చేసిందనే విషయాలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బృంద సభ్యులు సిద్ధమవుతున్నారు.
| < Prev | Next > |
|---|


