Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

జయ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కరుణానిధి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాన్ని రూ.551 కోట్లతో నిర్మించిన అసెంబ్లీని హాస్పటల్ గా మార్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేస్తున్న ప్రయత్నాలకు మద్రాస్ హైకోర్టు  తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు డి.మురుగేశన్, పీఎస్‌ఎస్ జనార్దన రాజాలతో కూడినడివిజన్ బెంచ్ శుక్రవారం మధ్యంతర స్టే ఇచ్చింది.

ఆస్పత్రి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరని స్పష్టం చేస్తూ... కేసు విచారణ పూర్తయ్యేదాకా సచివాలయ భవనంలో ఎలాంటి మార్పులు చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి తమ ఉత్తర్వులే మీ అడ్డంకి కావని కోర్టు పేర్కొంది.