Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఇస్రో మాజీ చైర్మన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు

ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌పై కేంద్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికి కానీ భవిష్యత్తులో కానీ ప్రభుత్వ ఉద్యోగానికి మాధవన్‌ నాయర్‌ అనర్హుడంటూ ఈమేరకు డిపార్టమెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆంత్రిక్స్‌-దేవాస్‌ డీల్‌లో మాధవన్‌ నాయర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రేడియో తరంగాల కోసం ఎస్‌-బాండ్‌ ఫ్రీక్వెన్సీ అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి.

దీంట్లో మాధవన్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాయర్‌తో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలపై కూడా నిషేధం విధించింది. ఇస్రో మాజీ సైంటిఫిక్‌ సెక్రటరీ భాస్కర్‌నారాయణ, ఆంత్రిక్స్‌ మాజీ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీథామూర్తి, ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌ మాజీ డైరక్టర్‌ కెఎన్‌ శంకరాలపైన కూడా కేంద్రం వేటు వేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను పద్మభూషణ నాయర్‌ కొట్టిపారేశారు.