ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌లో ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 60 స్థానాలకు 279 మంది పోటీ పడ్తున్నారు. ఉగ్రవాదుల దాడుల నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటూ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, మణిపూర్ పీపుల్స్ పార్టీలు ఎన్నికలలో పాల్గొంటున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ మొట్టమొదటిసారి మణిపూర్‌లో పోటీ చేస్తోంది. మణిపూర్‌లో తృణమూల్‌కు చెందిన మమతా బెనర్జీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మినహా ప్రధాన నేతలెవ్వరూ ప్రచారాన్ని నిర్వహించలేదు. ఓటుహక్కును ఎక్కువగా ఉపయోగించుకునే రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్ ఏ పార్టీకి పట్టం కడుతుందో తెలియాలంటే మార్చి వరకూ వేచి ఉండాల్సిందే.
| < Prev | Next > |
|---|


