Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

సచిన్ పైలట్ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డు మృతి

కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ఇంటి వద్ద 32 ఏళ్ల సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నాగాలాండ్‌లోని కోహిమాకు చెందిన ఇనపు అనే ఆ సెక్యూరిటీ గార్డు తన గన్‌ను తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆ సంఘటన న్యూఢిల్లీలోని సఫ్ధర్ గంజ్ రోడ్డులో పైలట్ నివాసం వద్ద జరగిందని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలో స్యూసైడ్ నోటీసు ఏదీ లభించలేదు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడివల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగాలాండ్ సాయుధ పోలీసు బలగాలకు చెందిన ఇనపు శనివారం రాత్రి పది గంటల నుంచి విధుల్లో ఉన్నాడు. అర్థరాత్రి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.