Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

సాల్మన్ రష్దీకి హక్కు లేదు : ఇమ్రాన్

ముస్లీం మతస్థుల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు సాల్మన్ రష్దీకి లేదని పాకిస్థాన్ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. కోల్‌కతా లిటరరీ మీట్‌కు హాజరైన ఇమ్రాన్ మాట్లాడుతూ... రష్దీ రాసిన ‘ది సటానిక్ వర్సెస్’ సమస్యే కాదని ఓ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సమాజాన్ని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికి లేదని ఇమ్రాన్ అన్నారు. శాంతియుతంగా నివసించడానికి ఒకరినొకరు అర్ధం చేసుకోవాలన్నారు.

సామాజిక కార్యకర్త అన్నా హజారే రాజకీయాల్లోకి రావాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి ప్రవేశించి.. అధికారాన్ని చేపడితే.. అవినీతిపై సమర్ధవంతంగా పోరాటం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టు దారుణమైన వైఫల్యాలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కారణమన్నారు. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్ల టెక్నిక్, ఆటతీరుపై తీవ్ర ప్రభావం పడుతోందని పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ అన్నారు. భారత క్రికెట్ మెలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ట్వెంటీ20 క్రికెట్ మితీమీరిన ఫోకస్ ఉన్నందునే వైఫ్యల్యాలు ఎదురవుతున్నాయని ఐపీఎల్‌పై మండిపడ్డారు.