Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

జయలలిత vs విజయ్ కాంత్

తమిళనాడులో మిత్రపక్షాలైన అన్నాడిఎంకె, డిఎండికె ల మధ్య వార్ నడుస్తుంది. శాసనసభలో ఇరు పార్టీ వర్గాలు వాగ్వాదానికి దిగారు. శానససభ నుంచి బుధవారం విజయకాంత్‌తో సహా డిఎండికె సభ్యులు వాకౌట్ చేశారు. డిఎండికె సభ్యుడు చంద్రకుమార్ - ధరల పెరుగుదలపై జయలలితను ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఆయన అడిగారు. అయినా శంకరన్‌కోవిలి ఉప ఎన్నికలో తమ అన్నాడియంకె గెలిచిందని ఆమె సమాధానం ఇచ్చారు.

జయలలిత వ్యాఖ్యలతో శానససభలో గందరగోళం చెలరేగింది. దీంతో ఆగ్రహించిన డిఎండికె సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం విజయ్ కాంత్ మాట్లాడుతూ తమ పార్టీ వల్లనే శానససభ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె గెలిచిందని ఆయన అన్నారు. అవసరం తీరిన తర్వాత తమను జయలలిత వెళ్లిపొమ్మంటున్నారని ఆయన విమర్శించారు. శానససభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. విజయకాంత్ నాయకత్వంలోని డిఎండికెకు గతంలో కన్నా ఎక్కువ సీట్లే వచ్చాయి. జయలలిత మాట్లాడుతూ విజయ్ కాంత్ మద్దతు లేకపోయినా తమ పార్టీ గెలిచి ఉండేదన్నారు. డిఎండికెతో చేతులు కలిపినందుకు ఇప్పుడు విచారిస్తున్నామని ఆమె అన్నారు.