Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

2జీ కేసులో సుప్రీం సంచలన తీర్పు , చిదంబరానికి ఊరట

2జీ కేసులో చిదంబరాన్ని చేర్చాలన్న జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌లో చిదంబరానికి తాత్కాలికంగా ఊరట లభించింది. కేసు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు 2జీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రశాంత్ భూషణ్ పిటిషన్‌కు కోర్టు అంగీకరించలేదు. దానికి బదులుగా సీవీసీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్య స్వామి హర్షం వ్యక్తం చేసారు.

2జీ కేసులో జారీ చేసిన మొత్తం 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. 2జీ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రముఖ లాయర్ ప్రశాంత్‌ భూషణ్ పిటిషన్‌పై సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. 2008లో జారీ చేసిన లైసెన్సలన్నింటికీ 2001 ప్రకారం లెక్క కట్టారని ఉన్నత థర్మాసనం తేల్చి చెప్పింది. అంతే కాకుండా అక్రమంగా లైసెన్సులు పొందిన ఒక్కో కంపెనీకి ఐదు కోట్లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించాల్సిన కంపెనీల్లో యూనిటెక్‌, టాటా టెల్లీ, డి బి రియాల్టీ కూడా ఉన్నాయి.