Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు

పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్ను తిరువారూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

ఒకప్పుడు తనకు అత్యంత సన్నిహితురాలైన శశికళను, ఆమె బంధువులు 20మందిని సీఎం జయలలిత గత డిసెంబర్ లో పార్టీ నుంచి బహిష్కరించారు.  కాగా జయలలితను కాదని పార్టీలో శశికళ డామినేషన్ పెరగటంతోనే ఆమెను, మరో పదకొండు మందిని బహిష్కరించిన విషయం తెలిసిందే. జయలలితకు శశికల చాలాకాలం పాటు సన్నిహితురాలిగా కొనసాగింది. 1991-1996 మధ్య కాలంలోని పలు అక్రమాల ఆరోపణలలో జయలలితతో పాటు శశికళ కూడా ప్రధాన నిందితురాలు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది. ఇటీవలే జయలలిత ఈ కేసులో కర్నాటక రాజధాని బెంగళూరులో పలుమార్లు కోర్టు ఎదుట హాజరయ్యారు. తొలుత బెంగళూరు కోర్టు ఎదుట హాజరు కావొద్దని నిర్ణయించుకున్నప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమె హాజరు కాక తప్పలేదు.