Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

సంతాన ప్రాప్తిరస్తు!

How to get Pregnantముందుగా మీరు తెలుసుకోవలసింది అసలు గర్బం ఎలా ఏర్పడుతుంది? సంతానోత్పత్తికి ప్రధానంగా దోహదపడేవి ఆడవారి లో ఉత్పత్తి అయ్యే అండము మరియు మగవారిలో విడుదలయ్యే సుక్రకణాలు. ఈ రెండిటి కలయిక వల్ల గర్బం ఏర్పడుతుంది. అయితే మగవారిలో సుక్ర కణాలు దాదాపుగా లక్షల సంక్యలో విడుదలవగా, నేలకు కేవలం ఒక్క అండము మాత్రమే స్త్రీలలో విడుదలవుతుంది.

ఈ విదంగా విడుదలయిన అండం 24 గంటల పాటు సజీవంగా ఉండగా, లక్షల సంక్యలో విడుదలయ్యే సుక్ర కణాలు మాత్రం కొన్ని నిమిషాలలోనే మరణిస్తాయి. వీటిలో కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాయి.

అయితే ఇలా సజీవంగా ఉన్న సుక్ర కణాలు స్త్రీ లోని సర్విక్స్, యుటిరాస్, ఫెలోపియన్ ట్యూబ్, వోవరి అనే అనేక మార్గాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సివస్తుంది. ఈ ప్రయాణంలో మరికొన్ని సుక్ర కణాలు మరణిస్తాయి. 2-3 గంటలలోనే దాదాపుగా చాలా వరకు సుక్ర కణాలు మరణిస్తాయి. కేవలం బలంగా ఉన్న ఒక్క సుక్ర కణం మాత్రమే అండాన్ని చేరుకోగలుగుతుంది. అది కూడా 24 గంటలలోపు అయితేనే పలితం ఉంటుంది. అంటే మగ వారిలో విడుదలయ్యే సుక్ర కణాలను చాలా జాగ్రత్తగా స్త్రీ లోని పంపించాలన్న మాట.

సుక్ర కణాలను ఎంత లోపలికి పంపగలిగితే అంత త్వరగా అండాన్ని చేరుకుంటాయి. దీనికి సెక్స్ లో పాల్గొనే వివిధ బంగిమలు చాలా వరకు ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ప్రదానంగా మగవారు పైన పడుకుని చేసే పద్దతి. ఈ పద్దతిలో చేసుకోవడం ద్వారా సుక్ర కణాలు అండానికి దగ్గరగా విడుదలవుతాయి. మీరు పాటించే పద్ధతి ఏమైనప్పటికీ విడుదలయ్యే సుక్రకణాలను నేరుగా స్త్రీ లోనికి ప్రవేసించేటట్లు గా చూసుకోవాలి.

అయితే ఆడవారి లో ప్రతి నెల నెలసరి అయిన 12వ రోజు నుండి 18వ రోజు వరకు క్రమం తప్పకుండ సంబోగం జరిపినట్లయితే గర్బధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముక్యంగా తెల్లవారుజామున ఎక్కువగా ఆడువారిలో అండం విడుదల అవుతుందని వైద్యులు నిర్ధారణ చేసారు. తెల్లవారుజామున పురుషులలో విడుదలయ్యే సుక్ర కణాలు చాలా బలంగా హుషారుగా ఉంటాయట. అందువల్ల తెల్లవారుజామున సంబోగిస్తే ఎక్కువ పలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఆడవారు మరో ముఖ్యమైన విషయాన్నిగుర్తుంచుకోవాలి... వీర్య స్కలనం అయిన తరువాత వెంటనే లేచి నీటితో శుబ్రం చెయ్యకుండా వారి పిరుదుల కింద ఎత్తు (పిల్లో లేదా మందంగా ఉన్న బెడ్ సీట్ ను) పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉండాలి. అలా చెయ్యడం ద్వారా వీర్య కణాలు సాఫీగా ప్రయాణం చేసి నేరుగా లోపలికి వెళ్లి అండాన్నితాకగలుగుతాయి.

సంతాన ప్రాప్తిరస్తు!