ముంబై రంజీ జట్టు కెప్టెన్సీకి సీనియర్ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్ రాజీనామా చేశాడు. గత రెండేళ్లుగా రంజీల్లో ముంబై టైటిల్ నెగ్గకపోవడంతో బాధ్యత వహిస్తూ జాఫర్ గురువారం సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడు. నాలుగేళ్ల పాటు సారథ్యం వహించిన జాఫర్ 2008-09, 2009-10లలో ముంబైని రంజీ చాంపియన్‌గా నిలిపాడు. బ్యాటింగ్‌పై ఎక్కువ శ్రద్ద కనబరిచేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని అతను చెప్పినట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వర్గాలు తెలిపాయి.
కెప్టెన్సీకి వసీమ్ జాఫర్ రాజీనామా
- Friday, 03 February 2012 11:16
ఇంగ్లాండ్ నెంబర్ వన్ ర్యాంక్ నిలిచేనా..?
- Friday, 03 February 2012 11:07
టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ గా చెలామణి అవుతున్న ఇంగ్లాండ్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ లలో ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ర్యాంక్ దిగజారే ప్రమాదముంది. ఇంగ్లండ్... పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది. ముఖ్యంగా దుబాయ్ పిచ్‌పై చెలరేగుతున్న స్పిన్నర్ అజ్మల్, అబ్దుల్ రెహమాన్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అజ్మల్ 17 వికెట్లు తీస్తే, రెహమాన్ 12 వికెట్లు పడగొట్టాడు.
జైలు నుంచి విడుదలైన పాక్ బౌలర్ ఆమిర్
- Friday, 03 February 2012 10:55
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న పాక్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్ బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణంగా మూడు నెలల ముందుగానే అతనికి శిక్ష నుంచి విముక్తి కల్పించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆమిర్ ఆరు నెలల శిక్షకు గురయిన విషయం తెలిసిందే. సహచరులు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్ లతో పాటు గతేడాది నవంబర్ 3న జైలుపాలయ్యాడు. వాస్తవానికి అతన్ని శుక్రవారం విడుదల చేయాల్సి ఉండగా మీడియాను దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల ముందే బయటకు పంపించారు.
నేడు ఆసీస్ తో రెండో టి20 మ్యాచ్
- Friday, 03 February 2012 10:50
దెబ్బ మీద దెబ్బతో కుంగిపోయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే చివరి, రెండో టి-ట్వంటీ మ్యాచ్లో అయినా ఆసిస్ను ఓడించాలనే లక్ష్యంతో ఉంది భారత్. అంతేకాకుండా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఎమ్‌సీజీ మైదానంలో జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
పారదర్శకత ఉంటే వ్యతిరేకత ఎందుకు : మాకెన్
- Thursday, 02 February 2012 11:18
కేంద్ర క్రీడల మంత్రి అజయ్ మాకెన్ మళ్ళీ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)పై ధ్వజమెత్తారు. బోర్డు కార్యకలాపాలలో పారదర్శకత ఉంటే క్రీడా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించా రు. ‘క్రీడా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశంపై బీసీసీఐ మా మంత్రిత్వ శాఖకు 27 పేజీల లేఖను పంపింది. ఆర్‌టీఐ (సమాచార హక్కు చట్టం)కి భయపడనప్పుడు, పారదర్శకంగా ఉన్నప్పుడు బోర్డు బిల్లును ఎందుకు అడ్డుకుంటుందో నాకు అర్థం కావడం లేదు.


