Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

వన్డే టీంలోకి సచిన్, జహీర్, పఠాన్

ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మళ్ళీ ఇంతవరకు వన్డే మ్యాచ్ లు ఆడలేదు. అయితే ఆస్ట్రేలియాలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో సెలక్టర్లు సచిన్ ను ఎంపికచేశారు. దీంతో సచిన్ మళ్ళీ వన్డే లలో అవకాశం రానుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాల్గొనే 17 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును జాతీయ సెలక్టర్లు ఎంపిక చేశారు.

చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ మళ్ళీ జట్టులో చేరాడు. ఈ జట్టులో ధోనీ, సెహ్వాగ్, సచిన్, గంభీర్ సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, పార్థివ్ పటేల్, ఆర్.అశ్విన్, ఉమేష్ యాదవ్, ప్రవీణ్ కుమార్, మనోజ్ తివారీ, రాహుల్ శర్మ, వినయ్ కుమార్‌లు ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగుతున్న టెస్ట్ సిరీస్‌కు జట్టులో సభ్యుడైన బౌలర్ ఇషాంత్ శర్మకు జట్టులో చోటు కల్పించలేదు. అలాగే, గాయాల కారణంగా రవీంధ్ర జడేజా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్‌లను కూడా పక్కనబెట్టారు.