ఆస్ట్రేలియాలో వరుస పరాజయాలు చూస్తున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ. పెర్త్‌లో ముగిసిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనిపై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడింది. కనీస పరిమితికి రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది కాలంలో భారత్ స్లో ఓవర్ రేటును ఎదుర్కోవడం ఇది రెండోసారి. గత జూన్‌లో ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో రెండు సార్లు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్ ఓ టెస్టు నిషేధం ఎదుర్కొంటాడు.
| < Prev | Next > |
|---|


