Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

తొలి రౌండ్ లోనే ఓటమి పాలైన సానియా

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రోజే ముగిసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో సింగిల్స్ బరిలో ఉన్న ఏకైక భారత ప్లేయర్ సానియా మీర్జా తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది. భుజం గాయం కారణంగా పురుషుల సింగిల్స్ విభాగం నుంచి సోమ్‌దేవ్ ఇంతకుముందే వైదొలిగాడు.

ప్రపంచ 47వ ర్యాంకర్ పిరన్‌కోవా (బల్గేరియా)తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 105వ ర్యాంకర్ సానియా 4-6, 2-6తో పరాజయం పాలైంది. డబుల్స్‌లో ఈ హైదరాబాదీ, రష్యా ప్లేయర్ ఎలీనా వెస్నినాతో కలిసి ఆడనుంది.