ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు లభించాయి. అన్ను రాజ్ సింగ్, శ్వేతా చౌదురీ, హీనా సిద్ధూలతో కూడిన భారత జట్టు ఎయిర్ పిస్టల్ అంశంలో 1147 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... చైనా జట్టు 1146 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఇదే అంశంలోని వ్యక్తిగత విభాగంలో అన్ను రాజ్ సింగ్ 481.2 పాయింట్లతో కాంస్యం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో రాజ్ కుమారి 594 పాయింట్లతో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది.
కాగా మరోవైపు టాటా స్టీల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో పెంటేల హరికృష్ణ వరుసగా మూడో విజయాన్ని సాధించాడు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 33 ఎత్తుల్లో గెలుపొందాడు. గ్రాండ్‌మాస్టర్స్ ‘బి’ గ్రూప్‌లో ప్రస్తుతం హరికృష్ణ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
| < Prev | Next > |
|---|


