Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

మార్చిలో జహీర్, ఇషా పెళ్లి

టీమిండియా పేసర్ జహీర్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ ఇషా షర్వాణి త్వరలో ఓ ఇంటి వారు కాబోతున్నారు. ఆరేళ్ళ వారి ప్రేమను పెళ్లి పందిరి ఎక్కిన్చానున్నారు. గతంలో చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్స్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహాం మార్చి నెలలో జరగనుంది. ఈ విషయాన్ని జహీర్‌ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. ఇషా షర్వాణి, జహీర్‌ల మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం కొనసాగు తున్న విషయం తెలిసిందే.

పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లి జరుగుతుంది. త్వరలోనే వీరి నిశ్చితార్ధం జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ తారలు, క్రికెటర్లు రానున్నారు. 2005లో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక పార్టీలో ఇషా నృత్యం చేస్తుండగా జహీర్ చూడడం జరిగింది. అక్కడ ఏర్పడిన వారి పరిచయం ప్రేమకు దారితీసింది.