Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

మహిళల ఫైనల్లో షరపోవా vs అజరెంకా

డిఫెండింగ్ చాంపియన్ కిమ్ క్లియ్‌స్టర్స్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. గాయాన్ని లెక్కచేయకుండా ఇప్పటిదాకా అద్భుత ప్రదర్శన కొనసాగించిన ఈ బెల్జియం స్టార్‌ను మూడో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-4, 1-6, 6-3 తేడాతో ఓడించింది. గతేడాది వింబుల్డన్ సెమీస్‌దాకా వచ్చిన అజరెంకా ఈసారి తన గ్రాండ్‌స్లామ్ రికార్డును మెరుగుపరుచుకుంది.

అలాగే 1998 తర్వాత బెలారస్ నుంచి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన తొలి మహిళగా నిలిచింది. మరోవైపు రష్యా అందాల భామ షరపోవా తన అద్భుత జోరును కొనసాగించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో షరపోవా 6-2, 3-6, 6-4 తేడాతో క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గింది. దీంతో గతేడాది వింబుల్డన్ ఫైనల్లో క్విటోవా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది.