ఆస్ట్రేలియాలో భారత్ పరాజయం పరిపూర్ణమయింది. వల్డ్ ఫేమస్ ఇండియా బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. ఫలితంగా అడిలైడ్ టెస్ట్‌లో భారత్ 201 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లయాన్ 4, హారిస్ 3 వికెట్లు పడగొట్టారు. సిడిల్ కు 'మాన్ అఫ్ ది మ్యాచ్' లభించింది.
ఈ సిరిస్ లో ఒక త్రిపుల్ సెంచరీ, ఒక డబుల్ సెంచరీతో రాణించిన కెప్టెన్ క్లార్క్ కు 'మాన్ అఫ్ ది సిరీస్' లభించింది. దాంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో వరుసగా రెండు సిరీస్‌లను 4-0 తేడాతో ఇండియా ఓడిపోయింది. గత ఏడాది జూలై, ఆగస్టుల్లో ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఓడిన టీమిండియా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో అదే మార్జిన్‌తో ఓటమి పాలైంది. ఈ వరుస ఓటముల నేపథ్యంలో గత ఏడాది నంబర్ వన్ ర్యాంక్‌లో వున్న టీమిండియా తాజాగా, మూడో ర్యాంక్‌కు దిగజారింది. ప్రపంచ ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో వున్న భారత్ జట్టు విదేశీ గడ్డపై వరుస ఓటముల పాలవడం ఇదే ప్రథమం.
| < Prev | Next > |
|---|


