Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఈ ఓటమితో రిటైరవ్వాల్సిన అవసరం లేదు : సెహ్వాగ్

ఆసీస్‌ టూర్‌లో అట్టర్‌ ఫ్లాప్ అయిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు ఇంఛార్జి కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మద్దతు లభించింది. ఈ ఓటమికి ఎవరూ కుంగిపోయి రిటైరవ్వాల్సిన అవసరం లేదంటూ ఆటగాళ్లను అతను వెనకేసుకు వచ్చాడు. ఆస్ట్రేలియాలో 0-4 ఓటమి ప్రస్తావనకు ఇండియాలో 2-0 విజయం సాధించామని సెహ్వాగ్‌ సమాధానమిచ్చాడు. కొన్నేళ్లుగా ఇండియా బ్యాటింగ్‌ బ్రహ్మాండంగా వుందని, ఈ రెండు టూర్లలో బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని చెప్పాడు. ఆటగాళ్లు వ్యక్తిగతంగా రాణిస్తే, జట్టు మూడు, నాలుగు వందల స్కోర్ చేస్తుందని వీరూ అన్నాడు.

కాగా ఆస్ట్రేలియా బౌలర్లదే ఈ క్రెడిట్‌ అంతా అని ఆసీస్‌ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అన్నాడు. ఇండియా టీమ్‌లో లెజెండ్స్‌ వున్నారని, ప్రతిసారి ఆస్ట్రేలియా గడ్డపై వారు అద్భుత క్రికెట్‌ ఆడితే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారని సచిన్‌ను పరోక్షంగా క్లార్క్‌ ప్రశంసించాడు.