Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

హాకీ టీంలో సెలక్టయిన సౌందర్య, రజనీ

స్వదేశంలో వచ్చే నెలలో జరిగే లండన్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యెండల సౌందర్య 18 మంది సభ్యులుగల జట్టులో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి, గోల్‌కీపర్ రజని రిజర్వు గోల్ కీపర్ గా ఎన్నికయింది. మిడ్‌ఫీల్డర్ అసుంతా లాక్రా జట్టుకు నేతృత్వం వహిస్తుంది. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఉక్రెయిన్, కెనడా, పోలెండ్, దక్షిణాఫ్రికా, ఇటలీ పాల్గొంటాయి. విజేతగా నిలిచిన జట్టు మాత్రమే లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.

భారత మహిళల హాకీ జట్టు: అసుంతా లాక్రా (కెప్టెన్), యోగిత బాలి, సవిత (గోల్‌కీపర్లు), జస్‌ప్రీత్ కౌర్, జాయ్‌దీప్ కౌర్, సుభద్ర ప్రధాన్ (డిఫెండర్లు), సుశీల చాను, కిరణ్‌దీప్ కౌర్, దీపిక, రీతూ రాణి, ముక్తా ప్రావా బార్లా (మిడ్ ఫీల్డర్లు), యెండల సౌందర్య, పూనమ్ రాణి, వందన కటారియా, రాణి, అనురాధ దేవి, రోజ్‌లిన్ డుంగ్ డుంగ్, జస్జీత్ కౌర్ హండా (ఫార్వర్డ్స్).