Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

నేడు ఆసీస్ తో రెండో టి20 మ్యాచ్

దెబ్బ మీద దెబ్బతో కుంగిపోయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే చివరి, రెండో టి-ట్వంటీ మ్యాచ్లో అయినా ఆసిస్ను ఓడించాలనే లక్ష్యంతో ఉంది  భారత్. అంతేకాకుండా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఎమ్‌సీజీ మైదానంలో జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

మరోవైపు ఆతిథ్య జట్టు వరుసగా రెండో ఫార్మాట్‌లోనూ వైట్‌వాష్ చేసేందుకు తహతహలాడుతోంది. తొలి టి20 ఆడిన భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా స్థానంలో ఇర్ఫాన్ పఠాన్‌ను ఆడించొచ్చు. ఆసీస్ వికెట్ల స్వభావం దృష్ట్యా స్పిన్ ఆల్‌రౌండర్ కంటే పేస్ ఆల్‌రౌండర్ ఉండటం లాభం. ఆసీస్ జట్టులో ఆరోన్ ఫించ్, క్లింట్ మెక్‌కేలకు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రావొచ్చు.