Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

కెప్టెన్సీకి వసీమ్ జాఫర్ రాజీనామా

ముంబై రంజీ జట్టు కెప్టెన్సీకి సీనియర్ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్ రాజీనామా చేశాడు. గత రెండేళ్లుగా రంజీల్లో ముంబై టైటిల్ నెగ్గకపోవడంతో బాధ్యత వహిస్తూ జాఫర్ గురువారం సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడు. నాలుగేళ్ల పాటు సారథ్యం వహించిన జాఫర్ 2008-09, 2009-10లలో ముంబైని రంజీ చాంపియన్‌గా నిలిపాడు. బ్యాటింగ్‌పై ఎక్కువ శ్రద్ద కనబరిచేందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని అతను చెప్పినట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వర్గాలు తెలిపాయి.

త్వరలో సమావేశమయ్యే సెలక్షన్ ప్యానెల్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తుందని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి, ప్యానెల్ కన్వీనర్ నితిన్ దలాల్ తెలిపారు. జాఫర్ వారసుడిగా అభిషేక్ నాయర్‌ను నియమించే అవకాశాల్ని ఆయన తోసిపుచ్చారు.