Telugu News

 
Sports
బాలీవుడ్ నటి నీతూచంద్రను విచారించిన ఐసిసి అధికారులు E-mail
Wednesday, 08 September 2010 10:50

Neetu_chandraఐసిసి యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు బాలీవుడ్ నటి నీతూచంద్రను విచారించారు. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి సస్పెండైన పాక్ పేస్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ తో నీతూకు సంబంధాలు ఉన్నాయని ఐసిసి అధికారులు అనుమానిస్తున్నారు. ఆసిఫ్ మొబైల్ ను పరిశీలించగా నీతూ పేరు బయటపడిందని, అందుకే ఆమెను విచారిస్తున్నామని ఐసిసి అధికారులు తెలిపారు. నీతూకు ఆసిఫ్ తో భారత బుకీలతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆసిఫ్ మాజీ ప్రియురాలు వీణా మాలిక్ విచారణలో ఐసిసి అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలను నీతూచంద్ర కొట్టి పారేస్తున్నారు.

 
ఐపీఎల్ ఫైనా ఫిక్సింగ్ ఆరోపణలు: కొట్టిపారేసిన బిసిసిఐ E-mail
Wednesday, 08 September 2010 10:47

ఐపీఎల్ లో ఓ అగ్రశ్రేణి ఆటగాడి ఆట తీరు అనుమానంగా ఉందని " ది ఆస్ట్రేలియన్ పత్రిక " మంగళవారం ఓ కధనాన్ని ప్రచురించింది. ఇద్దరు లీగ్ అధికారులు ఐపీఎల్ లో ఓ అగ్రశ్రేణి ఆటగాడి ఆట తీరు పట్ల అనుమానం వ్యక్తం చేశారని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఆ పత్రిక కధనం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఐపీఎల్ తాత్కాలిక చైర్మన్ చిరాయు అమీన్ తెలిపారు.

"ఐసిసి, ఐపీఎల్ నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తుంటాం. ప్రతి ఆటగాడి ప్రవర్తనను నిశితంగా గమనిస్తూనే ఉంటాం. ప్రతీదీ మా నియంత్రణలోనే ఉంటుంది " అని అమీన్ వివరించారు. ఐపీఎల్ ఫిక్సింగ్ ఫై ఐసిసి యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ జరిపే విషయం తమకు తెలియదని ఆయన చెప్పారు.

 
మరో 3 రోజులలో ఛాంపియన్స్ లీగ్ E-mail
Tuesday, 07 September 2010 12:25

Airtel_Champions_League_T20 6 దేశాల నుంచి 10 జట్లు పాల్గొనే ఛాంపియన్స్ లీగ్ మరో 3 రోజుల్లో సెప్టెంబరు 10న దక్షిణ ఆఫ్రికాలో ప్రారంభం కాబోతుంది. సచిన్, ద్రావిడ్, ధోని, కుంబ్లే, కలిస్, మురళీధరన్, కామెరూన్ వైట వంటి హేమాహేమీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ15 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బారత్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 

Read more...
 
కామన్వెల్త్ లో పతకం సాధిస్తా : సైనానెహ్వాల్ E-mail
Tuesday, 07 September 2010 11:12

Saina_nehwalఅక్టోబర్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాధించడమే తన లక్ష్యమని బ్యాడ్మింటన్ సంచలనం సైనానెహ్వాల్ స్పష్టం చేసింది. "ఈ గేమ్స్ కోసం కఠినంగా ప్రాక్టీసు చేస్తున్నా, ఇంకా నాలుగు వారాల సమయం ఉంది కనుక మెడల్ సాధించడం ఫైనే గురి పెట్టా. ఎందుకంటే ఈ గేమ్స్ స్వదేశంలోనే జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ సైనా వ్యాఖ్యానించింది. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ కోల్పోవడం బాధను కలిగించలేదని సైనానెహ్వాల్ పేర్కొంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్స్ లోనే సైనా వెనుదిరిగింది. అయితే ఆ మ్యాచ్ లో చేసిన తప్పులు చూసి నాకే ఆశర్చమేసిందని మైదానంలో చురుకుగా కదలలేకపోయానని సైనా చెప్పింది.

 

 
పాక్ ఆటగాళ్ళ ఆస్తులఫై విచారణ E-mail
Tuesday, 07 September 2010 11:06

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో పరువు పోగొట్టుకున్నపాక్ ప్రభుత్వం ఎట్టకేలకు తమ ఆటగాళ్ళ ఆస్తులఫై విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. పాకిస్థాన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవిన్యూ తమ ప్రాంతీయ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పాక్ క్రికెట్ తో సంబంధం ఉన్న క్రికెటర్లు, కోచ్ లు,కామెంటేటర్లు, పిసిబి అధికారుల ఆస్తులు,వాహనాలు,ఫ్లాట్లు,దేశ విదేశాలలో ఉన్న బ్యాంకు ఎకౌంటులు,వ్యవసాయ క్షేత్రాల పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించింది. ఈ నెలాఖరుకల్లా అందరి ఆస్తుల వివరాలను సేకరిస్తామని పాక్ అధికారులు తెలియజేశారు.

 
  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  7 
  •  8 
  •  9 
  •  10 
  •  Next 
  •  End 
  • »


Page 1 of 25
Follow us on Twitter

Who's Online

We have 29 guests online

Advertisement