Telugu News

 
మొదటి టెస్టులోనే సెంచరీ సాధించిన సురేష్ రైనా E-mail
Friday, 30 July 2010 16:50

suresh_rainaభారత యువ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా 12వ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో 12వ ఆటగాడికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. మ్యాచ్ ఆడే మిగతా 11 మందికి మంచినీళ్లు, గ్లోవ్స్, ప్యాడ్స్ అందించడం, ఎవరైనా మైదానాన్ని వీడితే అతని స్థానంలో ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే వీరు ఉపయోగపడతారు. తొలి టెస్టులోనే సెంచరీ చేసిన భారతీయుల జాబితాలో  శ్రీలంకపై రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడం ద్వారా, కెరీర్‌లో ఆడిన మొదటి టెస్టులోనే ఈ ఫీట్‌ను అందుకున్న 12వ భారత ఆటగాడిగా రైనా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు.

గత పదేళ్ల కాలంలో వీరేందర్ సెహ్వాగ్ తర్వాత రైనాకే ఈ జాబితాలో స్థానం లభించడం విశేషం. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజి యాబాద్‌లో జన్మించిన రైనా ఇప్పటి వరకూ 88 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడి 2,165 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. గౌతం గంభీర్ గాయపడడంతో టెస్టులో ఆడే అవకాశం అతనికి దక్కిడంతో 120 పరుగులు చేసి సెంచరీ చేశాడు.

 
Follow us on Twitter

Who's Online

We have 17 guests online

Advertisement