Telugu News

 
బౌలింగ్ అకాడమీ స్థాపించనున్న మురళీధరన్---కుంబ్లే E-mail
Friday, 30 July 2010 17:30

శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ మరియు భారత్ లెజెండరీ స్పిన్నర్ అనీల్ కుంబ్లే కలసి త్వరలో ఓ స్పిన్ బౌలింగ్ అకాడమీని స్థాపించనున్నారు. వీరిలో ఒకరు 800 టెస్టు వికెట్లతో చరిత్ర సృష్టించిన దిగ్గజం అయితే, మరొకరు 619 వికెట్లను పడగొట్టిన యోధుడు. వీరిరువురూ కలసి ఒక అకాడమీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయమై మురళీధరన్ మాట్లాడుతూ తాను రెండేళ్ళ క్రితమే అనీల్ తో ఈ విషయమై చర్చించానని, అది ఇప్పుడు కార్యరూపం దాల్చనుందని తెలిపారు. నేనసలు రిటైర్మెంట్ అనంతరం కోచింగ్ వైపు దృష్టిసారించాలని అనుకోలేదు. కానీ అనీల్ అకాడమీ ప్రారంభిస్తే, అందులో భాగస్వామిగా చేరి సంతోషంగా సేవలందిస్తాను అని అన్నారు.

అయితే అనీల్ కుంబ్లే మాట్లాడుతూ " మురళీ టెస్టుల నుంచి రిటైర్మైంట్‌తో సన్మానాలు, సత్కారాలతో బిజీగా ఉండడంతో అతన్ని కలవడానికి వీలు కావడంలేదు. కొంతకాలం తరువాత ఇద్దరం తీరిగ్గా చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తామని " తెలిపారు.

 
Follow us on Twitter

Who's Online

We have 45 guests online

Advertisement