APReporter.com

 
హత్యకు గురైన అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆటగాడు లోరెంజెన్ వ్రైహ్ట్ E-mail
Saturday, 31 July 2010 07:46

lorenzenఅమెరికా నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మాజీ ఆటగాడు లోరెంజెన్ వ్రైహ్ట్(34) హత్యకు గురయ్యాడు. 13 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్‌లో లాస్ ఏంజెల్స్ క్లిప్పర్స్, అట్లాంటా హాక్స్, మెంఫిస్ గ్రిజ్లిస్, సాక్రమెంటో కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే క్లేవ్‌లాండ్ కావలియర్స్ తరఫున కూడా మ్యాచ్‌లో పాల్గొన్నాడు. 778 గేమ్స్ ఆడిన అతను సగటున 8 పాయింట్లు సాధించి, ఎన్‌బిఎ మేటి ఆటగాళ్ల సరసన స్థానం సంపాదించాడు. ఈనెల 18వ తేదీ అర్థరాత్రి చివరి సారి రైట్‌ను చూసినట్టు అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకటి రెండు రోజులు గడిచినా రైట్ ఇల్లు చేరకపోవడంతో 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, దర్యాప్తు ప్రారంభించినప్పటికీ వారికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. 19వ తేదీన అతని సెల్ ఫోన్ నుంచి చివరి కాల్ వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. రైట్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ సమీపంలోనే అతని మృత దేహం లభించింది. శరీరంపై తుపాకీతో కాల్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దీనితో దీనిని హత్యగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు ప్రకటించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం పంపామని, అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే మృతుడు లోరెంజెన్ఏ అన్న విషయం తేలుతుందని ఓ పోలీస్ అధికారి ప్రకటించాడు. మృత దేహంపై తుపాకీతో కాల్చిన ఆనవాళ్లు ఉన్నాయని అన్నాడు. అందుకే, దీనిని హత్యగా అనుమానిస్తే దర్యాప్తు చేపట్టామని వివరించాడు. కాగా, రైట్ హత్యపై ఎన్‌బిఎ వర్గాలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

 
Follow us on Twitter

Who's Online

We have 11 guests online

Advertisement