|
Tuesday, 07 September 2010 15:52 |
|
"సింహా" చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ఆ ఉత్సాహంతో వరుసగా సినిమాలు కమిట్ అవుతూ ముందుకు దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం బాలయ్య. ఇప్పటివరకూ రాముడు-భీముడు, సుల్తాన్, చెన్నకేశవ రెడ్డి, సింహా సినిమాలలో ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టిన బాలయ్య, ఇప్పుడు మొదటిసారి త్రిపాత్రాభినయంతో అభిమానులను అలరించనున్నారు
|
|
Read more...
|
|
|
Saturday, 04 September 2010 17:00 |
|
పవన్ కళ్యాణ్ జల్సా తరువాత రెండున్నర్ర సంవత్సరాలకి రిలీజవుతున్న 'కొమరం పులి" సినిమా కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు మళ్ళీ నిరాశే మిగిలింది. ఎన్నో కారణాల వల్ల ఇన్నాళ్ళూ వాయిదా పడుతూ వచ్చిన కొమరం పులి ఈ నెల 9 వ తేదీన విడుదలవుతుందని ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రానికి చెన్నై కోర్టు స్టే విధించింది
|
|
Read more...
|
|
Thursday, 19 August 2010 17:02 |
|
జల్సా సినిమా తరువాత దాదాపు రెండున్నర్ర సంవత్సరాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ కు "ఖుషి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న 'కొమరం పులి" చిత్రాన్ని సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.
కొన్ని కారణాల వల్ల ఎప్పటినుండో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రానికి భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు,అకాడమీ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. ప్రస్తుతానికి మిక్సింగ్ ఎండ్ సీజీ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం పవన్ చిత్రాలలో మోస్ట్ పవర్ ఫుల్ చిత్రం అవుతుందని, పవన్ చెప్పిన డైలాగ్స్ సినీ ఇండస్ట్రీలో ప్రభంజనాన్ని సృష్టిస్తాయని సినీవర్గాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో, ఈ రెండు సంబరాలను జరుపుకునేందుకు పవన్ మరియు చిరూ అభిమానులు ఆ రోజు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ తను తీసిన చిత్రాలలో ఇంత సంతృప్తినిచ్చిన సినిమా మరొకటి లేదని, ఈ జన్మలో పవన్ కళ్యాణ్ తో కొమరం పులి తీశానని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. నిఖేషా పటేల్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రం ఆడియో మార్కెట్ లో విడుదలై ఇప్పటికే అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. |
|
Friday, 30 July 2010 10:15 |
|
గద్దె సింధూర ప్రధాన పాత్రధారిగా శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై కిరణ్ నిర్మిస్తున్న 'కిల్లర్' చిత్రం నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుంది. ఇందులో గద్దె సింధూర ఒక విభిన్న పాత్రను అద్భుతంగా చేశారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతినిస్తుంది. ఆగస్టు తొలి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంగతిని దర్శకుడు నగేష్ తెలియజేస్తూ గతంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి నగేష్ నారదాశి దర్సకత్వం వహించారు.
|
|
Tuesday, 13 July 2010 16:44 |
|
శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై అష్టాచమ్మా ఫేమ్ నాని, నిత్య మీనన్ హీరో , హీరొయిన్ లుగా చేస్తూ, కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'అలా మొదలైంది'. ఈ సినిమా సినిమా గురించి నిర్మాత దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ "నిజంగానే ఇదో వైవిధ్యమైన ప్రేమకథాచిత్రం. ఆగస్టులో చిత్రీకరణని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రేమకథాచిత్రమే అయినా ఆ ప్రేమని తెరపై చూపించే తీరు పూర్తి నవ్యంగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా యాభై శాతం పూర్తయిందని కుడా వారు వివరించారు. మరి ఈ సినిమా కుడా నానికి అష్టాచమ్మా అంత హిట్ అవ్వాలని కోరుకుందాం.
|
|
|
|
|
|
|
Page 1 of 5 |