APReporter.com

 
పాకిస్థాన్‌లో వరద బీభత్సానికి 300 మంది బలి E-mail
Saturday, 31 July 2010 08:11

pak floodsగత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కైబర్ - పాక్తున్‌ఖ్వా ప్రావెన్సులోనే 291 మంది మృత్యువాత పడ్డారని పాక్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇదే ప్రాంతంలో కొండచరియ విరిగిపడడంతో శుక్రవారం 49 మంది సజీవ సమాధి అయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 20 మంది, పంజాబ్‌లో 34 మంది చనిపోయారు. సహాయక బందాలతో పాటు, పాక్ సైన్యం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కైబర్ ప్రావెన్సులో 1929 తర్వాత ఇంత భారీగా వర్షాలు కురవడం ఇదే తొలిసారని ఆ దేశ జాతీయ విపత్తుల నియంత్రణ సంస్థ తెలిపింది. స్వాత్ నది ఈ వరదలకు ఉధతంగా ప్రవహిస్తోందని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. పెషావర్‌లో 302 మిల్లీమీటర్లు, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో 190 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరద బీభత్సానికి సుమారు 300 మంది మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

 
Follow us on Twitter

Who's Online

We have 12 guests online

Advertisement