|
Saturday, 31 July 2010 08:34 |
|
బ్రిటన్‌లో నిరుద్యోగ సమస్యను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతి ఒక్క వ్యక్తి పనికాలాన్ని 65 ఏళ్లకు కుదించింది. దీని ప్రకారం ప్రతిఒక్కరూ తమకు 65ఏళ్ల వయసు వచ్చిదంటే రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిందే. అయితే ప్రభుత్వ నిర్ణయంపై దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తి సంస్థ అయిన ఈఈఎఫ్ తన అసంతప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం చాలా ప్రమాదకరమైందని ఆ సంస్థ పేర్కొంది.పలు సంస్థలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. వ్యాపార సంబంధాల్లో రిటైర్మెంట్ అనేది మరింత మంది కొత్త వారిని పైకి తీసుకురావడానికి, వారిలోని శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఉపయోగపడే అంశమని, అయితే, కచ్చితంగా ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్దేశించడం వాంఛనీయం కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 65 ఏళ్లు దాటిన తర్వాత కార్మికుడిని పని చేయాల్సిందిగా యజమాని ఒత్తిడి చేయరాదు. 'దేశంలోని చాలామంది ప్రజలు తాము పనిచేయాల్సిన వయోపరిమితిని మరింత పెంచాలని కోరుతున్నారు. అయితే, వారు ఒక వయసుకు వచ్చాక పనిచేయకుండా ఉద్యోగ విరమణ చేసేలా నిర్దేశించాలనుకున్నాం' అని ఉపాధి వ్యవహారాల మంత్రి ఎడ్ దవే చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి తేవాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.
|