|
Saturday, 31 July 2010 15:28 |
|
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాకిస్థాన్ నీట మునిగింది. వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లుతుండడంతో పాకిస్థాన్ లో అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు, పలు గ్రామాలలోని గృహాలు వరద నీటిలో కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికే పాకిస్థాన్ లో 400 మంది మరణించగా, మరో 4లక్షల మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా వరదల కారణంగా 60 మంది మృతి చెందారు. ఈ వరదల కారణంగా పాకిస్థాన్ లోని రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గత 80 ఏళ్ళ తరువాత ఇంతటి భారీ వరదలు రావడం ఇదే ప్రప్రధమమని పాక్ అధికారులు తెలిపారు.
|