Telugu News

 
లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గుర్తింపును రద్దు చేసిన ఈసీ E-mail
Saturday, 31 July 2010 15:47

పలు రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనేసం 4 రాష్ట్రాల్లో అది గుర్తింపు పొంది ఉండాలి. అయితే కేంద్ర మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీకి బీహార్, నాగాలాండ్, మణిపూర్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో అది దారుణంగా వైఫల్యం చెందడంతో ఎన్నికల సంఘం ఆర్జేడీ పార్టీ గుర్తింపును ఈ రోజు రద్దు చేసింది.

దీనితో పాటు వివిధ రాష్ట్రాలలోని మరో ఐదు పార్టీల గుర్తింపును కూడా ఈసీ రద్దు చేసింది. వీటిలో తమిళనాడు వై.గోపాలస్వామి (వైగో) నేతృత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పుదుచ్చేరి శాఖ, జార్ఖండ్ ‌లో జేడీయూ మరియు మధ్యప్రదేశ్, ఉత్తరాంఛల్ రాష్ట్రాల్లోని సమాజ్‌వాదీ పార్టీలు కూడా తమ గుర్తింపును కోల్పయాయి.

 
Follow us on Twitter

Who's Online

We have 15 guests online

Advertisement