Telugu News

 
ఉత్తర చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు E-mail
Saturday, 31 July 2010 16:01

ఉత్తర చైనాలో ఈ రోజు తెల్లవారుజామున 2:40 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఉత్తర షాంక్సీ ప్రొవీన్స్‌లోని లిన్ఫెన్ నగరం సమీపంలో గల లైగ్యూ అనే బొగ్గు గనిలోని డార్మిటరీ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో 15 మంది మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇది ఒకవేళ గన్ పౌడర్ గదిలో సంభవించి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఆవకాశం ఉండగా, చైనాలోని బొగ్గు గనుల్లో ఇటువంటి ప్రమాదం జరగడం ఈ వారంలో ఇది రెండవ సారి.

 
Follow us on Twitter

Who's Online

We have 28 guests online

Advertisement