|
Friday, 28 May 2010 14:15 |
|
ఒక్క క్షణం రాజకీయాలను పక్కన పెట్టండి. జనాదరణ పొందిన ఒక వ్యక్తీ మరణానికి చింతిస్తూ ఎన్నో ప్రాణాలు పోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం ఒక రాజకీయ నాయకుడిగా కాకపోయినా ఒక కొడుకుగా (ఎవరున్న) వారి బాద్యత. జగన్ రాజకీయం చేస్తున్నారా లేక నిస్వార్ధం తో ఈ యాత్ర చేస్తున్నారో పక్కన పెట్టండి. ఆ కుటుంబాలను పరామర్శించడం అనేది అవసరం. ఎ కోణం లో ఆలోచించిన జగన్ చేస్తుంది సరియయినది అని అందరికి తెలుసు.
మరి ఎందుకు ఈ దాడి? ఎక్కడున్నాం మనం? రాళ్ళతో ఒక మనిషి పై దాడి చెయ్యడం అనేది ఎక్కడనుండి నేర్చుకున్న సంస్క్రుతి? మనం మనుషులమే కదా. అమాయకుల చేతులకు రాళ్ళు ఇస్తుంది ఎవరు? ఇది నిజంగా దుర్మార్గం! రాజకీయాలు ఉండవచ్చేమో! కాని ఇంతిలనా! అసలేమి జరుగుతుంది! అమాయకుల్ని చెడు మార్గంలో ప్రోత్శాహిస్తే రేపటి పరిణామాలకు ఎవరు బాద్యత వహిస్తారు? వారిని అదుపు చెయ్యగల దమ్ము ఈ నాయకులకు ఉందా?. మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి వెళుతున్నామా?. ఆలోచించడి!!!
|
Who's Online
We have 17 guests online