ఫోర్జరీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్‌గా తీసుకుని ఓ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడన్న ఆరోపణలతో సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్‌ను లోన్‌గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్‌బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.
బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్
- Friday, 03 February 2012 11:26
టిటిడికి వ్యతిరేకంగా తిరుమలకు కాలిబాటలో : చిన్న జీయర్
- Friday, 03 February 2012 10:43
చిన్న జీయర్ శిష్యులతో తిరుపతి కోలాహలంగా మారింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మరికొద్దిసేపట్లో విష్ణు సహస్రనామ స్త్రోత్రపారాయణం జరగనుంది. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలిబాటలో జీయర్ యాత్ర చేపడతారు. టిటిడి 110 తప్పులు చేసిందని ప్రకటించిన నేపథ్యంలో చిన్నజీయర్ పర్యటన ఉత్కంఠగా మారింది. గతంలో టీటీడీపై చేసిన వాదనకు తాను కట్టుబడి ఉన్నానని దీనిపై పూర్తిస్తాయిలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.
విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు
- Friday, 03 February 2012 10:41
తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.
నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు : ముస్తాబైన ఖమ్మం
- Thursday, 02 February 2012 10:43
పార్టీ ఎదుగుదల, ప్రత్యామ్నాయ సంస్కృతి, ప్రజాసమస్యల్ని రాజకీయ ఎజెండాలోకి తేవడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఎం 23వ రాష్ట్ర మహాసభలు గురువారం నుంచి పోరాటాల ఖిల్లా ఖమ్మంలో జరగనున్నాయి. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం ప్రారంభ సమావేశానంతరం మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ మొదలవుతుంది. రెండో రోజంతా పార్టీ కార్యకలాపాలపై చర్చ ఉంటుంది.
ముందు ఆ పార్టీల అభిప్రాయం చెప్పమనండి : చిద్దూ
- Wednesday, 01 February 2012 10:33
తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం మళ్ళీ పాత పాటనే పునరావృత్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై ఎప్పుడు తమ అభిప్రాయం చెబితే అప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణాపై ఏదో ఒకటి తెల్చేస్తామన్నారు కదా ఏమి చేశారు? అని ఒక విలేకరి అడగగా ఆయన పై విధంగా స్పందించారు. అఖిలపక్షం తేదీ కూడా ఆ పార్తీలనే అడగండి అంటూ ఉహిత సలహా ఇచ్చారు. తెలంగాణపై ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం తమ అభిప్రాయాలు చెప్పాయి.
కిరణ్ సర్కార్ కూలిపోవడం ఖాయం : కోదండరాం
- Wednesday, 01 February 2012 10:18
కిరణ్ ప్రభుత్వం అవసానదశలో ఉందని, ఎప్పుడైనా కూలిపోవచ్చని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం జోస్యం చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఉసురుపోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. సీఎం, డీజీపీల ఆదేశాల మేరకే ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. కేసులెత్తేస్తామని అసెంబ్లీలో చెప్పి, ఒక్కో వ్యక్తిపై ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించినట్లు తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
యానాం రీజన్సీ సిరామిక్స్ లాకౌట్
- Wednesday, 01 February 2012 09:59
యానాంలోని సిరామిక్ టైల్స్ తయారీ పరిశ్రమ రీజన్సీ సిరామిక్స్ కంపెనీ మంగళవారం రాత్రి మాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. పరిశ్రమ జనరల్ మేనేజర్ హెచ్.ఆర్.కే ఈ లాకౌట్ ప్రకటన కాపీని పరిశ్రమ మెయిన్ గెట్ వద్ద అతికించారు. రెండు రోజుల క్రితం కొంతమంది కార్మికులు కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలు, విద్యాసంస్థలు, వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిపిందే.
జగన్ పిచ్చివాడులా మారాడు : పాల్వాయి
- Tuesday, 31 January 2012 12:49
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పిచ్చోడులా మారాడని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన తండ్రి వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలన్న తపనతో ఆయనకు పిచ్చెక్కిందన్నారు. జగన్‌కు పిచ్చిముదరడం వల్లే కాంగ్రెస్ పార్టీపైనా, కాంగ్రెస్ ప్రభుత్వం పైనా తన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు.
దాడి వీరభద్రరావుకు చేదు అనుభవం
- Tuesday, 31 January 2012 11:37
జూనియర్ డాక్టర్ల సమస్యలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. జూడాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ దాడి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఉదయం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయన వాహనాన్ని సీఎం భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాగా అదే సమయంలో ప్రముఖ నిర్మాత రామానాయుడుకు లోనికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇచ్చారు.
More Articles...
- సీబీఐ కస్టడీలో బీపీ ఆచార్య
- యానాం ఘటనలో నిందితుల గుర్తింపు : డీఐజీ శుక్లా
- ప్రభుత్వ చేతగాని తనం వల్లే జూడాల సమ్మె : చంద్రబాబు
- వేములవాడలో కోడెల వీరంగం
- క్షీణిస్తున్న జూడాల ఆరోగ్యం, ఆరో రోజుకు చేరిన సమ్మె
- కాణిపాకంలో కలకలం
- యానాం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి : హర్షకుమార్
- విగ్రహాల ధ్వంసం కేసులో ముగ్గురి అరెస్ట్
- సీఎం అయ్యాక తొలి సంతకం వ్యాట్ పైనే : జగన్
- బాబు.. దమ్ముంటే నాపై గెలువు : నాగం


