జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డికి నాంపల్లి కోర్టు ఈనెల 31 వరకూ రిమాండ్ విధించింది. సీబీఐ కస్టడీ నిన్నటితో ముగియటంతో ఆయన్ని అధికారులు మంగళవారం ఉదయం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
విచారణ అనంతరం ఈ నెలాఖరు వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. కాగా జైలులో ల్యాప్ టాప్ వాడుకునేందుకు అనుమతివ్వాలంటూ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది.
| < Prev | Next > |
|---|


