తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. తెదేపా సభ్యత్వానికి వెబ్‌సైట్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో ఐదు నిమిషాల్లోనే తెదేపా సభ్యత్వం తీసుకోవచ్చునని చంద్రబాబు తెలిపారు. తెదేపా సభ్యత్వం తీసుకునే వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని చంద్రబాబు తెలియజేశారు.
| < Prev | Next > |
|---|


