Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

లగడపాటి పై పోటీ చేస్తానన్న బాలయ్య

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మంగళవారం అభిప్రాయపడ్డారు. ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య ప్రకటించడం హర్షణీయమన్నారు. విజయవాడ నుండి పోటీ చేయాలని ఆయన అన్నారు. స్థానిక కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను ఓడించాలంటే బాలయ్యే అందుకు సమర్థుడైన వ్యక్తి అన్నారు.

ఆయన విజయవాడ నుండి పోటీ చేస్తే చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుందన్నారు. బాలయ్య పోటీ మిగిలిన పార్టీలను ఖంగు తినిపించడం ఖాయమన్నారు. కాగా ఇటీవల కృష్ణా జిల్లాలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన తర్వాత బాలయ్య ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తారు?, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు.రు.