Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

విగ్రహాల ధ్వంసం కేసులో ముగ్గురి అరెస్ట్

అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో 13మందిపై కేసులు నమోదు చేసినట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట చేసిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ తాగిన మైకంలోనే నిందితులు విగ్రహాలను ధ్వంసం చేశారని తెలిపారు.

అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులు ఇరవయ్యేళ్ల లోపువారేనని, పరారీలో ఉన్న మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ధ్వంసం చేసిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ పడవేసిందీ నిందితులు పోలీసులకు చూపించారు. స్థానిక వ్యవసాయ బావిలో పడేసిన విగ్రహాలను పోలీసులు బయటకు తీసి స్టేషన్కు తరలించారు. నాలుగురోజుల క్రితం అమలాపురం ప్రాంతంలో జరిగిన విగ్రహాల విధ్వంసం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెలిసిందే.