Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

కాణిపాకంలో కలకలం

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయంలోని హుండీ నుంచి వింత శబ్దాలు కాసేపు కలకలం సృష్టించాయి. అద్దాలమేడ వద్ద గల హుండిలో వింత శబ్దాలు రావడాన్ని భక్తులు గమనించారు. బాంబు ఉందనే అనుమానంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో భక్తులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన బాంబుస్క్వాడ్‌ అధికారులు మూడు గంటలపాటు క్షుణ్నంగా పరిశీలించారు. ఆధునిక పరికరాల ద్వారా ఓ ఎలక్ట్రానిక్‌ వస్తువు ఉందని నిర్ధారణకు వచ్ఛారు. చివరకు డిజిటల్‌ రిస్ట్‌వాచ్‌గా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.