జూనియర్ డాక్లర్ల నిరాహార దీక్షలు ఆరోరోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఉన్నవారి ఆరోగ్యం క్షీణిస్తున్నా సర్కారు మాత్రం స్పందించపోడంపై జూడాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జూనియర్ డాక్టర్లు కేవలం స్టైఫండ్ పెంచుకోవడానికే సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వారు మండి పడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, అత్యవసరమైన మందుసామాగ్రి అందుబాటులోకి తేవాలనేది తమ పదకొండు డిమాండ్లలో ముఖ్యమైనదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. అవసరమైతే అత్యవసర సర్వీసులను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు అన్నారు. అయితే, జూనియర్ డాక్టర్లది మొండివైఖరి అని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. ఇప్పటికే వారి డిమాండ్లన్నీ పరిష్కరించామని, ఒక్క స్టయిఫండ్ విషయంలోనే 40 శాతం డిమాండుకు 25 శాతంగా అంగీకరించామని ఆయన అన్నారు. అయినా జూడాలు మొండిగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఒక్కో డాక్టరుపై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రబుత్వం వారి డిమాండ్లు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తిసుకుంటోందని ఆయన అన్నారు.
| < Prev | Next > |
|---|


