Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

వేములవాడలో కోడెల వీరంగం

కరీంనగర్‌జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో రెండు కోడెలు సోమవారం వీరంగం సృష్టించాయి. ఆలయంలోని రెండు కోడెలు కయ్యానికి కాలు దువ్వుకోవటమే కాకుండా, కొమ్ములతో కుస్తీకి దిగాయి. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో కోడెలు కొట్టుకోవడం ప్రారంభించాయి. గంటకు పైగా రెండు కోడెల మధ్య కుస్తీ యుద్ధం కొనసాగింది.

సోమవారం కావడంతో రెండు లక్షలకు పైగా భక్తులు రాజన్న దర్శనానికి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. అంతలోనే రచ్చ రచ్చ చేసిన కోడెలు నాలుగు దుకాణాలు, ఒక మోటర్ సైకిల్‌ను ధ్వంసం చేశాయి. భక్తులు భయంతో పరుగులు తీయగా కొందరు స్వల్పంగా గాయపడ్డారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆలయ సిబ్బంది కోడెలను విడదీసేందుకు నానా కష్టాలు పడ్డారు.