Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

ప్రభుత్వ చేతగాని తనం వల్లే జూడాల సమ్మె : చంద్రబాబు

ప్రభుత్వ చేతగాని తనం వల్లే జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టవలసిన అవసరం వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. జూడాల డిమాండ్లు సరైనవేనన్నారు. నిరుపేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం జూడాల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న జూడాల ఆందోళనకు బాబు మద్దతు ప్రకటించారు.

ఎన్నిరకాలుగా ఉద్యమించినా డిమాండ్లు పరిష్కరించకపోవడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందని బాబు విమర్శించారు. ఈవిషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డిలు మొండి వైఖరి వీడాలని ఆయన అన్నారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా జూనియర్ డాక్టర్లకు సంఘీభావం తెలిపింది. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ జూడాలకు అండగా ఉంటామని ఆ పార్టీ నేత హరీష్ రావు హామీ ఇచ్చారు. తక్షణమే చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించకుంటే, ఆందోళన ఉదృతమవుతుందని హెచ్చరించారు.