Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

యానాం ఘటనలో నిందితుల గుర్తింపు : డీఐజీ శుక్లా

యానాంలో రీజెన్సీ సిరామిక్స్ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ మృతిని హత్యకేసుగా నమోదు చేసినట్లు డీఐజీ శుక్లా తెలిపారు. చంద్రశేఖర్ ని హత్య చేసిన వారిని, పోలిస్ స్టేషన్ పై దాడులు జరిపిన వారిని గుర్తించామన్నారు. నిందితులు స్వచ్చందంగా లొంగిపోవాలని లేదంటే ఏక్షణంలో అయినా అరెస్ట్ చేస్తామని తెలిపారు. అరెస్ట్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

యానంలో ఇకపై ఎలాంటి అల్లర్లు చోటుచేసుకున్నా కటిన చర్యలు తీసుకుంటామన్నారు. లూటీకి పాల్పడిన వారు వస్తువులను రీజెన్సీ సంస్థకు తిరిగి అప్పగించాలని, లేదంటే ఇళ్ళలో సోదాలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామన్నారు. కాగా యానాంలో పరిస్థితి అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ తెలిపారు. కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. యానాం పరిపాలన అధికారిగా ఓ సీనియర్ అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరతామని వెల్లడించారు. కార్మికనేత మురళీమోహన్ మృతిపై విచారణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.