ఎమ్మార్ కేసులో సోమవారం సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్యను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం ఆయనను సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రెండు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఫిబ్రవరి 1న సాయంత్రం 4 గంటలకు ఆచార్యను తిరిగి కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.
ప్రభుత్వ వాటా 6 శాతానికి పడిపోవటానికి ప్రధాన కుట్రదారు ఆచార్య అని సీబీఐ వాదిస్తుంది. మంగళవారం సీబీఐ అధికారులు ఆచార్యను వైద్య పరీక్షలకు తరలించారు. బేగంపేటలోని సీజీహెచ్ఎస్ ఆస్పత్రిలో ఆయనకు గుండె సంబంధిత పరీక్షలు చేయించారు. కాగా బీపీ ఆచార్య నీరసంగా ఉన్నారని, ఆయనకు ఎప్పటికప్పుడూ గ్లూకోజ్ ఎక్కించాలని సీజీహెచ్ఎస్ వైద్యులు తెలిపారు. అనంతరం బీపీ ఆచార్యను దిల్కుశ అతిథిగృహానికి తరలించారు.
| < Prev | Next > |
|---|


